Header Banner

రేపు ఏపీకి ప్రధాని మోడీ.. బంగాళాఖాతంలో ఆవర్తనం.. కోస్తాకు పొంచి ఉన్న వానగండం!

  Thu May 01, 2025 13:45        Politics

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపటి అమరావతి పర్యటనకు వర్షం రూపంలో ఆటంకం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ప్రధాని రానున్న నేపథ్యంలో, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న తరుణంలో, వర్షం ముప్పు పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ప్రధాని సభ జరగనున్న ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో, ప్రధాని సభ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

ఇది కూడా చదవండి: ఇది ఒక చరిత్రాత్మక అడుగు.. ‘వేవ్స్‌’ 2025ను ప్రారంభించిన మోదీ!

 

నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న వీర పాండ్యన్ ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యంగా, ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని, భద్రతాపరమైన అంశాలకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సభా ప్రాంగణంలో వర్షం కురిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. వర్షం కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, ఒక్కసారిగా కదిలే ప్రయత్నం చేస్తే తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, భద్రతా సిబ్బందిని ఎలా అప్రమత్తం చేయాలనే దానిపై సమావేశంలో కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations